tholli kalavee iviyu - m bala murali krishna


తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు కనుదెరచినంతనే కలుగు నీ జగము కనుమూసినంతనే కడుశూన్యమౌను కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును తన మనోభావనలఁ దగిలి తోచీని తలచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు తలపు మరచినమతికి దట్టమౌఁ దమము పొలసి మతిమరగుననె పుట్టుటలుఁ బోవుటలు పలుచంచలవికారభావ మీ గుణము ముందు దాఁ గలిగితే మూడు లోకములుఁ గల- వెందు దా లేకుంటే నేమియును లేదు అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీడె కందువల నితనిసంకల్ప మీపనులు tolli kalavE iviyu tolli tAnu@M galaDE kallayunu@M gAdu idi kaDu nijamu gAdu kanuderachinaMtanE kalugu nI jagamu kanumUsinaMtanE kaDuSUnyamaunu kanureppa mara@Mgunane kalimiyunu lEmiyunu tana manObhAvanala@M dagili tOchIni talachinaMtane yeMtadavvayina@M gAn&piMchu talapu marachinamatiki daTTamau@M damamu polasi matimaragunane puTTuTalu@M bOvuTalu paluchaMchalavikArabhAva mI guNamu muMdu dA@M galigitE mUDu lOkamulu@M gala- veMdu dA lEkuMTE nEmiyunu lEdu aMdi SrIvEMkaTESu@M DAtmalOnane vIDe kaMduvala nitanisaMkalpa mIpanulu